ఏపీ అసెంబ్లీలోకి ఈటీవీ, ఏబీన్, టీవీ5కి నో ఎంట్రీ
BY Telugu Gateway25 July 2019 8:00 AM GMT
X
Telugu Gateway25 July 2019 8:00 AM GMT
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నిండా రెండు నెలలు పూర్తి కాలేదు కానీ..రాజకీయం మాత్రం మళ్ళీ అప్పుడే ఎన్నికలు ఉన్నాయా అన్న చందంగా హాట్ హాట్ గా సాగుతోంది. రెండు రోజుల క్రితం సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, రామానాయుడులను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత టీడీపీ నేతలు నిరసన ప్రదర్శన కూడా నిర్వహించారు.
అయితే సభ సాగుతుండగా టీడీపీ నిరసన కార్యక్రమాలను లైవ్ ఇచ్చినందుకు అసెంబ్లీ అధికారులు ఆయా ఛానళ్ళపై చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 ఛానళ్లకు చెందిన కెమెరామెన్లు, కెమెరాలను అసెంబ్లీ మీడియా పాయింట్ లోకి కూడా అనుమతించటం లేదు. రిపోర్టర్లను మాత్రం అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతిస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Next Story