‘డియర్ కామ్రెడ్’ ట్రైలర్ విడుదల
క్రేజీ కాంబినేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన ‘డియర్ కామ్రెడ్’ ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఇది మరో సారి హిట్ కాంబినేషన్ అవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం(మోహన్), యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూడు నిమిషాల ట్రైలర్‌లో సినిమా లైన్ చెప్పకనే చెప్పేశారు.
యాక్షన్ ఎమోషన్‌తో పాటు విజయ్ మార్క్ లిప్‌లాక్స్ తో కూడా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కు మంచి రెస్సాన్స్‌రావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను ఒకే రోజున విడుదల చేస్తున్నారు. శృతి రామచంద్రన్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈసినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్నారు.రిలీజ్ అయిన కొద్ది వ్యవధిలోనే డియర్ కామ్రెడ్ ట్రైలర్ దూసుకెళుతోంది.
https://www.youtube.com/watch?time_continue=4&v=x_NEfuXTR1c