Telugu Gateway
Politics

తెలంగాణలో బిజెపి జెండా ఎగరేస్తాం

తెలంగాణలో బిజెపి జెండా ఎగరేస్తాం
X

బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన వ్యూహం ఏంటో చెప్పేశారు. తెలంగాణలో బిజెపి ఎండా ఎగరేయటం ఖాయం అని ప్రకటించారు. తెలంగాణలో ప్రజల బతుకులు బాగుపడాలంటే రాష్ట్రంలో బిజెపి గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కేరళలోనూ బలపడతామని తెలిపారు. ఒక్క రోజు తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా శనివారం నాడు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బిజెపి సభ్యత్య కార్యక్రమాన్ని ఆయన ఇక్కడ నుంచే ప్రారంభించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి అతి పెద్ద పార్టీ అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ దిశగా తెలంగాణ నేతలు తమ వంతు కృషి చేస్తారని నమ్ముతున్నట్లు తెలిపారు. బిజెపిలో కుటుంబ పాలన లేదని, వారసత్వ రాజకీయాలు కూడా ఉండవన్నారు. కొన్ని సిద్ధాంతాల ఆధారంగా పార్టీ నడుస్తుందని అమిత్ షా వ్యాఖ్యానించారు.

తాము విజయానికి పొంగిపోవటం లేదని అన్నారు. కాంగ్రెస్ ఓ కుటుంబంపై ఆధారపడిన పార్టీ అని..ఓటమిని తట్టుకోలేక విలవిలలాడుతోందని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్ లో రైతులు, పేదలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అమిత్ షా వెల్లడించారు. శంషాబాద్‌లో అమిత్ షా పార్టీ సభ్యత్వ నమోదును కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిరిజన మహిళ సోని బీజేపీ సభ్యురాలిగా అమిత్‌షా సమక్షంలో తొలి సభ్యత్వం తీసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరారు. అమిత్‌ షా ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. భాస్కరరావుతో పాటు రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి చంద్రవదన్ కూడా బీజేపీ తీర్థంపుచ్చుకున్నారు. బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడుతూ.. బిజెపిని చులకనగా చూసిన కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదాకూడా దక్కలేదన్నారు. ‘తెలంగాణలో 20 లక్షల సభ్యత్వమే మా లక్ష్యం. 2022 కల్లా 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నెలకొల్పుతాం’అన్నారు.

Next Story
Share it