Telugu Gateway
Cinema

సంక్రాంతి బరిలో అల్లు అర్జున్ సినిమా

సంక్రాంతి బరిలో అల్లు అర్జున్ సినిమా
X

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్టైలిష్ స్టార్ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో అల్లు అర్జున్ సినిమా నిలవనుంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో బన్నీ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. గతంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలు సాధించటంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.

Next Story
Share it