Telugu Gateway
Telangana

దుబాయ్ లో పట్టుపడ్డ నటుడు శివాజీ

దుబాయ్ లో పట్టుపడ్డ నటుడు శివాజీ
X

నటుడు శివాజీ మరోసారి అమెరికా పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ సారి దుబాయ్ నుంచి అమెరికా వెళ్ళేందుకు ప్రయత్నించగా..ఆయన్ను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అమెరికా వెళ్ళేందుకు రెడీ అయిన శివాజీని దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో శివాజీ ని నిలిపివేశారు. గతంలో కూడా శివాజీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించగా...అప్పుడు కూడా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అలందా మీడియా కేసు లో శివాజీ పై గతం లో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి చాలా రోజుల పాటు కన్పించకుండా పోయిన శివాజీ కోర్టు నుంచి ఊరట పొందారు. ఆ తర్వాతే అమెరికా వెళ్లే ప్రయత్నం చేసి విఫలమయ్యారు.

టీవీ9 విక్రయానికి సంబంధించి మాజీ సీఈవో రవిప్రకాష్ తన వాటాను శివాజీకి బదిలీ చేయటం..ఈ వాటాను అడ్డుపెట్టుకుని శివాజీ ఎన్ సీఎల్ టీ లో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విక్రయానికి సంబంధించి తమ వాదనలు కూడా వినాలని కోరిన విషయం తెలిసిందే. ఎన్ సీఎల్ టీ కూడా తర్వాత వీరి అభ్యంతరాలను పక్కన పెట్టింది. మరి హైదరాబాద్ పోలీసులు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. దురుద్దేశపూర్వకంగా రవిప్రకాష్, శివాజీలు కలసి టీవీ9 విక్రయానికి సమస్యలు సృష్టించే ప్రయత్నం చేసిందని అలందా మీడియా ఆరోపించిన విషయం తెలిసిందే.

Next Story
Share it