Telugu Gateway
Andhra Pradesh

జ‌స్టిస్ ప్రవీణ్ కుమార్ తో జ‌గ‌న్ బేటీ

జ‌స్టిస్ ప్రవీణ్ కుమార్ తో జ‌గ‌న్ బేటీ
X

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న హామీల అమ‌లు దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ప్ర‌మాణ స్వీకార స‌మ‌యంలో గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన టెండ‌ర్ల అక్ర‌మాల‌ను నిగ్గుతేల్చేందుకు జ్యుడిషియ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో కొత్త ప్ర‌భుత్వం ఎలాంటి అవినీతికి తావులేకుండా అత్యంత పార‌ద‌ర్శ‌కంగా టెండ‌ర్లు నిర్వ‌హిస్తుంద‌ని పేర్కొన్నారు. జ‌గ‌న్ మంగ‌ళ‌వారం నాడు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌ను కలిశారు. మంగళవారం సాయంత్రం ఉండవల్లిలోని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నివాసం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.

అదే స‌మ‌యంలో కాంట్రాక్టుల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకతను పాటించడం కోసం జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేసే విషయంపై ఏసీజేతో చర్చించారు. సీఎం వైఎస్‌ జగన్‌ వెంట న్యాయనిపుణులు, ఇతర నేతలు ఉన్నారు. కమిషన్‌ ఏర్పాటు కోసం ఓ సిట్టింగ్‌ న్యాయమూర్తిని కేటాయించాలని జ‌గ‌న్ కోరిన‌ట్లు స‌మాచారం. న్యాయమూర్తిని కేటాయిస్తే ఇకపై జరగబోయే టెండర్ల ప్రక్రియ మొత్తం ఈ న్యాయమూర్తి ఇచ్చే సూచనలు, సలహాలు, మార్గదర్శకాల ఆధారంగా జరిగే అవకాశం ఉంటుంద‌ని స‌మాచారం.

Next Story
Share it