Top
Telugu Gateway

విరాట్ కొహ్లి ‘రికార్డు’

విరాట్ కొహ్లి ‘రికార్డు’
X

ప్రపంచ కప్ క్రికెట్ లో కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. భారత కెప్టెన్ విరాట్ కొహ్లి అత్యంత కీలకమై ప్రపంచ కప్ లో కొత్త మైలు రాళ్ళను అందుకున్నాడు. వేగంగా 20 వేల అంతర్జాతీయ పరుగుల మార్కును సాధించిన రికార్డును కోహ్లి నమోదు చేశాడు. వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి ఈ ఫీట్‌ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు 37 పరుగుల దూరంలో ఉన్న కోహ్లి దాన్ని అందుకున్నాడు. దాంతో 417 ఇన్నింగ్స్‌ల్లో 20 వేల అంతర్జాతీయ పరుగులు(టెస్టులు, వన్డేలు, టీ20లు) సాధించి ‘ఫాస్టెస్ట్‌ రికార్డు’ నెలకొల్పాడు.

అంతకుముందు ఈ రికార్డు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, బ్రియాన్‌ లారాల పేరిట సంయుక్తంగా ఉంది. వారిద్దరూ 20 వేల అంతర్జాతీయ పరుగుల్ని 453 ఇన్నింగ్స్‌ల్లో సాధించగా, దాన్ని కోహ్లి తాజాగా బ్రేక్‌ చేశాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్‌(464 ఇన్నింగ్స్‌లు) మూడో స్థానంలో ఉండగా, ఏబీ డివిలియర్స్‌(483) నాల్గో స్థానంలో ఉన్నాడు. రాహుల్‌ ద్రవిడ్‌(492 ఇన్నింగ్స్‌లు) ఆరో స్థానంలో ఉన్నాడు.

Next Story
Share it