Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

విజయ్ మాల్యాకు చేదు అనుభవం

0

భారత్ లో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్ లో ఎంజాయ్ చేస్తున్న విజయ్ మాల్యాకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం నాడు లండన్ లోని  ఓవల్ స్టేడియంలో జరిగిన  ఇంగ్లాండ్-భారత్ ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు మాల్యా తన కొడుకుతో కలసి వచ్చాడు. మాల్యాను చూసిన ప్రేక్షకుల్లో కొంత మంది ఆయన్ను చూసి చోర్‌..చోర్‌ (దొంగ..దొంగ)అని అరవడం మొదలుపెట్టారు. దేశానికి క్షమాపణ చెప్పు అంటూ నినాదాలు చేశారు.

- Advertisement -

                                   నినాదాలు చేస్తున్న వారికి ఏదో సమాధానం ఇచ్చినప్పటి ఈ పరిణామంతో మాల్యా మాత్రం ఖంగుతిన్నారు. ఈ పరిణామంపై విలేకరులు ప్రశ్నించినపుడు తాను మ్యాచ్‌  చూడ్డానికి వచ్చానని, జూలైలో జరగనున్న తదుపరి విచారణకు సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్నానని చెప్పారు.  ఆస్ట్రేలియాపై ఇండియా విజయం సాధించిన  మ్యాచ్‌ను తన కొడుకుతో కలిసి మ్యాచ్‌  చూడటం సంతోషంగా ఉందంటూ ట్వీట్‌ చేశాడు. ఈ సందర్భంగా  విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని భారత టీమ్‌కు అభినందనలు తెలిపాడు.

 

Leave A Reply

Your email address will not be published.