Telugu Gateway
Politics

బంగారు తెలంగాణలో ‘ఓటర్ల తీర్పు అపహస్యం’

బంగారు తెలంగాణలో ‘ఓటర్ల తీర్పు అపహస్యం’
X

మన కష్టం మనం అనుభవించటం ఓకే. కానీ పక్కొడి కష్టాన్ని కూడా మనమే అనుభవించాలని చూస్తే?. దాన్ని ఏమంటారు?. దేశానికే ‘ఆదర్శం’ అని చెప్పుకునే నేతలు ఓటర్ల తీర్పును ఇంతగా అపహస్యం చేస్తారా?. బంగారు తెలంగాణలో రాజకీయ ఫిరాయింపులు చట్టబద్దమా?. అధికార టీఆర్ఎస్ పదే పదే అదే అదే పని పనిచేస్తోంది. కాకపోతే ప్రతిసారి ఓ కొత్త ట్యాగ్ లైన్ పెడుతోంది. అంతే తప్ప ఈ ఫిరాయింపులను ఏ మాత్రం ఆపటం లేదు. పైగా అడ్డగోలుగా సమర్థించుకుంటోంది. అసలు అసెంబ్లీలోనే ప్రతిపక్షం లేకుండా చేసి..ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకుండా చేసుకోవటం ద్వారా టీఆర్ఎస్ సర్కారు ఏమి ఆశిస్తోంది. గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు ఏకంగా 88 సీట్లను కట్టబెట్టారు. కారణాలు ఏమైనా కూడా ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. అంటే ఇక్కడ అధికార టీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించినట్లే. కానీ ఓటర్ల తీర్పును అపహస్యం చేస్తూ అధికార పార్టీ పంచన చేరిన కొంత మంది ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గ ఓటర్లు చుక్కలు చూపించిన సందర్బాలు కూడా ఉన్నాయి.

నిజంగా కాంగ్రెస్ లో ఉంటే అభివృద్ధి జరగదు..కెసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ప్రగతిపథంలో పయనిస్తుందని నమ్మేవాళ్ళు అయితే మరి అదే పార్టీలో పోటీచేసి గెలిచి ఉండాల్సింది. కానీ కాంగ్రెస్ టిక్కెట్ పై.. ఆ పార్టీ నినాదాలతో గెలిచి టీఆర్ఎస్ వైపు మళ్లటం అంటే?. ఓట్లు వేసిన ప్రజలను వంచించటం కాదా?. టీఆర్ఎస్ ఎవరైనా ఈ ఫిరాయింపులపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ గతంలో చేయలేదా?. అనే ఎదురు ప్రశ్న వేస్తున్నారు. గతంలో ఇలాంటి పనులు చేసినందుకే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలోనూ..రాష్ట్రాల స్థాయిలోనూ అందుకు ప్రతిఫలాన్ని అనుభవిస్తోంది. అంటే రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కూడా అందుకు సిద్ధపడే ఈ పనిచేస్తుందా?. కాంగ్రెస్ చేసింది కాబట్టి మేం కూడా చేస్తాం అంటే దానికి జస్టిఫికేషన్ ఉంటుందా?.

నైతికత...బంగారు తెలంగాణ..దేశానికే ఆదర్శం వంటి మాటలు ఎందుకు మరి?. నిజంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు లేకపోతే ప్రభుత్వం ప్రమాదంలో పడే పరిస్థితి ఉన్న సమయంలో ఫిరాయింపులు తప్పు అయినా కూడా ప్రజలు ఒకింత ఆమోదిస్తారు. కానీ కేవలం రాజకీయ కారణాలతో ప్రత్యర్ధి పార్టీలే ఉండకూడదు..ప్రశ్నించే వారే ఉండకూడదు అనే ధోరణి రాబోయే రోజుల్లో ప్రమాదకర పోకడలకు సంకేతాలు పంపుతున్నట్లే లెక్క. టీఆర్ఎస్ లో తమను విలీనం చేయాలంటూ

Next Story
Share it