Telugu Gateway
Cinema

‘సైరా’ షూటింగ్ పూర్తి

‘సైరా’ షూటింగ్ పూర్తి
X

భారీ బడ్జెట్ తో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహరెడ్డి’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక సినిమా విడుదల ఎప్పుడా అని చిరంజీవి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూడటమే మిగిలింది. ఈ సినిమాకు నిర్మాత చిరు తనయుడు రామ్ చరణే కావటం విశేషం. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా విజయ్‌ సేతుపతి, నయనతార వంటి స్టార్లు భాగమయ్యారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఖైదీ నంబర్‌ 150 సినిమాతో భారీ హిట్‌ కొట్టిన చిరంజీవి సైరాతో మరోసారి రికార్డులు బ్రేక్‌ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

‘సైరా’ షూటింగ్ పూర్తయిన విషయాన్ని సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు ట్విట్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా షూటింగ్‌కు సహకరించిన ‘సైరా’ టీం మొత్తానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్ర షూటింగ్ ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిందన్నారు. మొత్తానికి చిత్రం అద్భుతంగా వచ్చిందన్నారు.

Next Story
Share it