Top
Telugu Gateway

రవిప్రకాష్ కు సుప్రీంలో షాక్

రవిప్రకాష్ కు సుప్రీంలో షాక్
X

ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు సుప్రీంకోర్టులోనూ షాక్ తగిలింది. గత కొంత కాలంగా అజ్ణాతంలో ఉంటున్న రవిప్రకాష్ పోలీసుల నోటీసులకు స్పందించకుండా కాలయాపన చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు పోలీసుల ఎదుట హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఆయన ఇక బయటకు రాక తప్పనిసరి పరిస్థితి ఎదురైంది. ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో పరారీలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు అన్ని దారులు మూసుకుపోయాయి.

పోలీసులకు చిక్కకుండా కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో తలదాచుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. పోలీసులు ఎంత గాలించినా.. రవిప్రకాశ్‌ పదేపదే స్థావరాలు మారుస్తూ వస్తున్నాడు. ఇప్పటి దాకా దాదాపు 30 సిమ్‌ కార్డులు మార్చారని వార్తలు వచ్చాయి. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆయన బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించడంతో ఇప్పుడు లొంగిపోవడం మినహా మరో మార్గం లేదని చెబుతున్నారు.

Next Story
Share it