Top
Telugu Gateway

శర్వానంద్ కు ప్రమాదం

శర్వానంద్ కు ప్రమాదం
X

టాలీవుడ్ హీరో శర్వానంద్ షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యాడు. థాయ్ ల్యాండ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ‘96’ సినిమా షూటింగ్ కోసం కసరత్తులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బ్యాలెన్స్ తప్పి శర్వానంద్ ల్యాండ్ అయ్యారు. దీంతో హీరో శర్వానంద్ భుజాలకు..కాలుకు గాయాలయ్యాయి. కాలు స్పల్పంగా ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే శర్వానంద్ ను థాయ్ ల్యాండ్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయనకు సన్ షైన్ ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. భుజానికి పెద్ద గాయం కావటంతో శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్లు తేల్చినట్లు సమాచారం.

ఈ శస్త్ర చికిత్స తర్వాత నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. శిక్షకుల సమక్షంలోనే హీరో ఈ కార్యక్రమం చేసినా ప్రమాదానికి గురయ్యారు. గత కొన్ని రోజులుగా స్కై డైవింగ్ ప్రాక్టీస్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ హీరో..విపరీతమైన గాలి రావటంతో బ్యాలెన్స్ కోల్పోయి ప్రమాదం బారిన పడాల్సి వచ్చింది. అదేమి విచిత్రమో కానీ టాలీవుడ్ కు చెందిన హీరోలు అందరూ వరస పెట్టి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవలే వరుణ్ తేజ్ కారు అతి పెద్ద కారు ప్రమాదం నుంచి తప్పించుకోగా..నాగశౌర్య, సందీప్ కిషన్ లు కూడా ప్రమాదాల బారినపడ్డారు.

Next Story
Share it