Telugu Gateway
Cinema

‘సాహో’ రికార్డులు

‘సాహో’ రికార్డులు
X

ఒక్క రోజు. అరవై లక్షల డిజిటల్ వ్యూస్. అంతే కాదు..య్యూటూబ్, ట్విట్టర్ లో సాహో ట్రెండింగ్ తో దూసుకెళుతోంది. విడుదలైన ఒక్క రోజులోనే సాహో టీజర్ నాలుగు భాషల్లో కలుపుకుని అరవై మిలియన్ల వ్యూస్ సాధించింది. రాబోయే రోజుల్లో ఈ టీజర్ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కన్పిస్తోంది. బాహుబలి తరువాత ప్రభాస్ బిగ్‌స్క్రీన్‌పై కనిపించక చాలా రోజులు అయ్యేసరికి అభిమానులు కసితో ఉన్నారు.

ఒక్కసారిగా వారి ఎదురుచూపులన్నీ సాహో టీజర్‌తో తీరిపోయాయి. హాలీవుడ్‌ స్థాయిలో ఉన్న ఈ టీజర్‌.. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. శ్రద్దా కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Next Story
Share it