Telugu Gateway
Cinema

‘సాహో’ టీజర్ అదుర్స్

‘సాహో’ టీజర్ అదుర్స్
X

అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు..గ్రాఫిక్స్ హంగామాతో ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో టీజర్ వచ్చేసింది. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు అదే స్థాయిలో టీజర్‌ను కట్ చేశారు. ప్రభాస్‌ స్టైలిష్‌ లుక్‌తో పాటు భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ లు టీజర్‌లో కనువిందు చేశాయి. టీజర్‌లో ప్రధాన పాత్రలను పరిచయం చేసిన మేకర్స్‌, ఫోకస్ అంతా హీరో ప్రభాస్ పైనే పెట్టినట్లు కన్పిస్తోంది. ముఖ్యంగా ప్రభాస్‌పై తెరకెక్కించిన కార్‌, బైక్‌ చేజ్‌లతో సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో చూపించారు.

బాహుబలితో అం‍తర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ రేంజ్‌ ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కటం ఖాయంగా కనిపిస్తోంది. టీజర్‌లో ప్రభాస్‌ను హాలీవుడ్ హీరో స్థాయిలో స్టైలిష్ లుక్‌లో ప్రజెంట్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శ్రద్ధా కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. మెయిన్ విలన్‌ నీల్‌ నితిన్‌ ముఖేష్‌లతో పాటు అరుణ్ విజయ్‌, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్‌, మహేష్ మంజ్రేకర్‌, మందిరా బేడి, ఎవ్లిన్‌ శర్మ, వెన్నెల కిశోర్‌లను టీజర్‌లోనే రకరకాల హావభావాలతో చూపించారు. విదేశాల్లో చిత్రీకరించిన యాక్షన్‌ సీన్స్‌ ఏరియల్‌ షాట్స్‌ ఎంతో రిచ్ నెస్ తో కన్నార్పకుండా చూసేలా ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన సాహో అంతర్జాతీయ స్థాయిలో విడుదలకు రెడీ అవుతోంది.

https://www.youtube.com/watch?v=Jln4eyvzMNg

Next Story
Share it