Telugu Gateway
Cinema

నితిన్ తో ‘ప్రియా ప్రకాష్ వారియర్’

నితిన్ తో ‘ప్రియా ప్రకాష్ వారియర్’
X

ప్రియా ప్రకాష్ వారియర్. ఒక్క కన్నుగీటుతో పెద్ద సంచలనంగా మారిన ఈ మళయాళ కుట్టి ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. హీరో నితిన్ తో కలసి నటించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఆదివారం నాడు జరిగింది. ఇది నితిన్ నటిస్తున్న 28వ చిత్రం. ఈ మూవీని ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని..ఇది తనకెంతో ప్రత్యేకమైన సినిమా అని హీరో నితిన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. భవ్యా క్రియేషన్స్ పై ఈ సినిమాను ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తున్నారు. నితిన్ ప్రస్తతం భీష్మ సినిమాలో బిజీగా ఉన్నారు. ఇందులో ఆయనకు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. ప్రియాప్రకాష్ వారియర్ తొలి సినిమా తెలుగులో పెద్దగా ఆడలేదు. మరి తొలి స్ట్రెయిట్ సినిమా హిట్ వస్తుందా?. మిగిలి హీరోయిన్లలాగా టాలీవుడ్ లో పాగా వేయగలుగుతుందా?. అంటే వేచిచూడాల్సిందే అని చెప్పకతప్పదు.

Next Story
Share it