Telugu Gateway
Politics

మాజీ ఎంపీ కవితకు మరో షాక్

మాజీ ఎంపీ కవితకు మరో షాక్
X

తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ వైపు అధికార టీఆర్ఎస్ విజయం వైపు దూసుకెళుతోంది. ఇటీవలే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కవిత నిజామాబాద్ ఎంపీగా ఓటమి పాలవటం పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ సీటును బిజెపి తరపున పోటీచేసిన అరవింద్ గెలుచుకుని సంచలనం సృష్టించారు.

ఇప్పుడు సీఎం కేసీఆర్ కుమార్తె స్వగ్రామంలో మాత్రం ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. నవీపేట మండలం పోతంగల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై కత్రోజి రాజు (బీజేపీ) ఘన విజయం సాధించారు. 95 ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు.

Next Story
Share it