ఏ1 కమిటీ వేస్తారు..ఏ2 విచారణ చేస్తారా?
BY Telugu Gateway28 Jun 2019 10:57 AM GMT
X
Telugu Gateway28 Jun 2019 10:57 AM GMT
నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా జగన్ సర్కారుపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు అక్రమాలపై మంత్రులతో విచారణ కమిటీ వేయగానే లోకేష్ తో సహా టీడీపీ నేతలు అందరూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విచారణ కమిటీపై లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నిజాయితీకే సిగ్గుచేటు అన్నవిధంగా.. అక్రమాస్తుల కేసులో ఏ1 గారు అవినీతిపై కమిటీ వేశారు.
ఏ2 విజయసాయిరెడ్డి విచారణ చేస్తారట! కలికాలం కాకపోతే అక్రమాల విక్రమార్కులు నీతి నిజాయితీ గురించి మాట్లాడటమా!!’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ప్రజావేదిక కూల్చివేటయం, చంద్రబాబు నివాసం ఉంటున్న ప్రాంతానికి నోటీసులు జారీ చేయటంపై ఇరు పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
Next Story