నాగచైతన్య..సాయిపల్లవి కొత్త సినిమా షురూ
BY Telugu Gateway27 Jun 2019 8:32 AM GMT

X
Telugu Gateway27 Jun 2019 8:32 AM GMT
తొలిసారి నాగచైతన్య, సాయిపల్లవి జోడీ కడుతున్నారు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా పూజ కార్యక్రమాలు సికింద్రాబాద్ వినాయకుడి ఆలయంలో జరిగాయి. మజిలీ వంటి సూపర్ హిట్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తోన్న నాగచైతన్య హీరోగా ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా సినిమా రూపొందుతుండటంతో ప్రాజెక్ట్ పై క్రేజ్ పెరిగింది. డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. సెప్టెంబర్ తొలివారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
Next Story