Telugu Gateway
Andhra Pradesh

పదవుల కోసం వైసీపీలో చేరలేదు

పదవుల కోసం వైసీపీలో చేరలేదు
X

ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై వివరణ ఇచ్చారు. తనకు టీటీడీ ఛైర్మన్ పోస్టు ఇస్తున్నారని కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారంలో పెట్టారని..దీంతో తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. తాను ఏ పదవి ఆశించి వైసీపీలో చేరలేదన్నారు. తన ఆశయం వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడటం. అందుకోసం నా వంతుగా కష్టపడ్డాను.

నేను తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కారణం వైఎస్‌ జగన్‌ ప్రజల ముఖ్యమంత్రి అవుతాడన్న నమ్మకమే గాని ఎలాంటి పదవులు ఆశించి కాదు. మీడియాకు నా విన్నపం పుకార్లను ప్రోత్సహించకండి’ అంటూ మోహన్‌ బాబు ట్విటర్‌లో పేర్కొన్నారు.

Next Story
Share it