Telugu Gateway
Andhra Pradesh

ఏడీసీ ఛైర్మన్ లక్ష్మీపార్థసారధిపై చర్యలు ఎలా?

ఏడీసీ ఛైర్మన్ లక్ష్మీపార్థసారధిపై చర్యలు ఎలా?
X

అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) ఛైర్మన్, మాజీ ఐఏఎస్ లక్ష్మీపార్ధసారధిపై చర్యలు ఎలా?. చంద్రబాబు హయాంలో ఆమె ఏడీసీ ఛైర్మన్ గా పోషించిన పాత్ర మామూలుగా లేదు. పదవీ విరమణ చేసిన అధికారిణి అయిన ఆమెకు చంద్రబాబు ఎక్కడలేని ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా..అంతా ఆమెతోనే నడిపించారు. వేల కోట్ల రూపాయల టెండర్లు మొదలుకుని...చిన్న టెండర్ల వరకూ అన్నీ ఆమె కనుసన్నల్లోనే సాగాయి. చివరకు మెక్కల కొనుగోలులోనూ ఆమె భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏడీసీలో అవినీతి చూసి దడుచుకున్న అధికారులు కొంత మంది లక్షలాది రూపాయల వేతనాలు వస్తున్నా మాకొద్దు బాబోయ్ ఈ ఉద్యోగం అంటూ అక్కడ అవినీతి చూసి దడుచుకుని పారిపోయారంటే ఏడీసీలో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. అంతే కాదు..అత్యంత కీలకమైన టెండర్లు అన్నీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పురపాలక శాఖమంత్రి నారాయణ చెప్పినట్లు ఏ పని ఎవరికి దక్కాలో అలా డిజైన్ చేశారనే ఆరోపణలు లక్ష్మీపార్థసారధిపై వెల్లువెత్తాయి.

సర్వీసులో ఉన్న అధికారులు అయితే ఇంత దారుణంగా చేయటానికి సాహసించరని..అందుకే ఆమెను చంద్రబాబు ప్రత్యేకంగా తీసుకొచ్చి ఏడీసీలో పెట్టారని చెబుతున్నారు. ఏడీసీ అక్రమాల వ్యవహారం తెలియటంతోనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు నిర్వహించిన సీఆర్ డీఏ సమావేశానికి ఆమెను దూరం పెట్టారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి పదవి విరమణ చేసిన అధికారిణి అయిన ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవటానికి ఛాన్స్ ఉంటుంది?. రికవరికి ఏమైనా అవకాశాలు ఉంటాయా అన్న అంశాలపై ఆలోచించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతితోపాటు ఏకంగా 30 అంశాలపై విచారణకు ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యగా ఆమె ఇఫ్పటికే తన పదవికి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరి విచారణ కాక ముందే ఆమెను పంపించి వేస్తుందా? లేక విచారణ వరకూ ఉండాల్సిందిగా ఆదేశిస్తుందా అన్న అంశంపై వేచిచూడాల్సిందే.

Next Story
Share it