Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు కేశినేని నాని షాక్!

చంద్రబాబుకు కేశినేని నాని షాక్!
X

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి విజయవాడ ఎంపీ కేశినేని నాని షాక్ ఇచ్చారు. ఆయనకు చంద్రబాబు తాజాగా లోక్ సభలో టీటీడీ విప్ బాధ్యతలను అప్పగించారు. అయితే ఈ పోస్టు తనకు వద్దనే విషయాన్ని నాని స్వయంగా చంద్రబాబుకు చెప్పకుండా ఏకంగా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టడం కలకలం రేపుతోంది. లోక్ సభలో పార్టీ విప్ వంటి ‘పెద్ద పోస్టు’ను నిర్వహించేందుకు తాను అర్హుడిని కానని..మరింత సమర్ధుడైన..అర్హుడైన వ్యక్తికి ఈ పోస్టు ఇవ్వాలంటూ వ్యాఖ్యానించటం మరింత దుమారం రేపుతోంది. విజయవాడ ప్రజలు తమ ఆశీస్సుల ద్వారా తాను లోక్ సభకు ఎన్నిక అయ్యానని..ఇలాంటి పోస్టుల కంటే తనకు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయటానికి కృష్టి చేస్తానని పేర్కొన్నారు. అదే సమయంలో లోక్ సభలో తనకు పార్టీ విప్ పోస్టు ఇఛ్చినందుకు ధన్యవాదాలు తెలుపూనే ఫేస్ బుక్ పోస్టును ప్రారంభించినా నాని ఉద్దేశపూర్వకంగానే బహిరంగంగా పెట్టారనే అభిప్రాయం విన్పిస్తోంది.

నాని ఇలా సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయటంతో ఆయన ఏమైనా పార్టీ మారే అవకాశం ఉందా అన్న కోణంలోనూ చర్చ సాగుతోంది. ఇటీవలే విజయవాడ ఎంపీ అయిన కేశినేని నాని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అయ్యారు. ఓ ఎంపీ కేంద్ర మంత్రితో భేటీ అవటంలో ఎలాంటి విశేషం లేకపోయినా..ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ మార్పు వార్తలపై నాని ఏమైనా స్పందిస్తారో లేదో వేచిచూడాల్సిందే.

నాని ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ ఇదే

I thank Sri Chandra Babu Naidu garu for appointing me as Party Whip in Loksabha.

But I humbly request him to appoint someone else who is more capable and efficient than me to that post as I feel that I’m not suitable to handle the responsibilities of such a big post.

The people of Vijayawada have given me their blessings and elected me as their Member of Parliament I would be more than happy to serve the constituency full time rather than this posts.

Once again I thank Chandra Babu garu for possessing faith in me and my apologies for rejecting the post.

Next Story
Share it