Telugu Gateway
Politics

జ‌గ‌న్ ను చూసి కెసీఆర్ నేర్చుకోవాలి

జ‌గ‌న్ ను చూసి కెసీఆర్ నేర్చుకోవాలి
X

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ సీనియ‌ర్ నేత జీవ‌న్ రెడ్డి సంచ‌ల వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ సీఎం కెసీఆర్ ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని చూసిఅయినా నేర్చుకోవాల‌ని సూచించారు. ఈ వ్యాఖ్య‌లు ఓ ర‌కంగా జ‌గ‌న్ కు ప్ర‌శంస అయితే..పాల‌న‌లో త‌న‌కు తిరుగులేద‌ని చెప్పుకుంటున్న‌కెసీఆర్ కు ఓ ర‌క‌మైన ఇబ్బందిక‌ర ప‌రిస్థితే. విద్య పట్ల కేసీఆర్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధనా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టడం హర్షణీయమన్నారు. అయితే ఇక్కడ మాత్రం 2019-20 విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా ఉపాధ్యాయుల కొరతలో మార్పులేదని విమర్శించారు. విద్యార్థుల కంటే ఉపాధ్యాయులే ఎక్కువగా ఉన్నారని విద్యాశాఖ మంత్రి పేర్కొనడం ఆయన అవగాహనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.

‘మన రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాలు పెంచుతుందని భావించాము. కేజీ నుంచి పీజీ వరకు ఆంగ్ల భాషలో నిర్బంధ విద్య అమలవుతుందని ఆశించాము. కానీ అవేమీ జరగలేదు. 20వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఎంపికైన టీచర్ల నియామక ప్రక్రియను ప్రభుత్వానికి ఇప్పటికీ సమర్పించలేదు. దీంతో ఈ విద్యా సంవత్సరం కూడా సమస్య అలాగే వుంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్‌ పాలన చూసి కేసీఆర్‌ కళ్లు తెరవాలి. ‘పక్క రాష్ట్రంలో సీఎం జగన్‌మోహన్ రెడ్డి తీసుకువస్తున్న సంస్కరణలు బాగున్నాయి . ప్రైవేటు పాఠశాలలో 25 శాతం సీట్లు ఇవ్వడంతో పాటు.. ప్రభుత్వ పాఠశాలలను మెరుగు పరిచేలా ఉన్నాయి. అమ్మఒడి వంటి వాటిని చేపట్టారు. నాడు వైఎస్సార్‌ పాదయాత్రతో సమస్యలు తెలుసుకుని... అనేక పథకాలు ప్రవేశ పెట్టారు. ఆయన దారిలో వైఎస్‌ జగన్‌ నడుస్తున్నారు.

Next Story
Share it