Top
Telugu Gateway

తెలంగాణ ఎమ్మెల్యేలకు కొత్త క్వార్టర్లు

తెలంగాణ ఎమ్మెల్యేలకు కొత్త క్వార్టర్లు
X

తెలంగాణలో శాసనసభ్యులకు కొత్త నివాస సయుదాయం అందుబాటులోకి వచ్చింది. ఈ సముదాయాన్ని సోమవారం నాడు ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రారంభించారు. హైదర్‌గూడలో సర్వ హంగులతో నిర్మితమైన శాసనసభ్యుల నివాస గృహ సముదాయాలు ఇక సభ్యులకు కేటాయించనున్నారు. వాస్తవానికి ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ నిర్మాణాల్లో విపరీతమైన జాప్యం జరిగింది. నాలుగున్నర ఎకరాల సువిశాల విస్తీర్ణంలో దాదాపు రూ.166 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించారు. ఎమ్మెల్యేలతోపాటు సిబ్బంది, సర్వెంట్ల కుటుంబాలు కూడా ఉండేందుకు వీలుగా ఈ సముదాయాన్ని సిద్ధం చేశారు.

119 మంది ఎమ్మెల్యేలతోపాటు మరో నియమిత ఎమ్మెల్యే... వెరసి 120 మంది సభ్యులు ఉండేందుకు వీలుగా వీటిని నిర్మించారు. దీంతోపాటు ఆరు అంతస్తుల్లో స్టాఫ్‌ క్వార్టర్లు నిర్మించారు. ఇందులో మొత్తం 36 ఫ్లాట్లు ఉంటాయి. 810 చ.అ. విస్తీర్ణం ఉండే రెండు పడక గదుల ఫ్లాట్లు 12, 615 చ.అ.విస్తీర్ణంలో ఉండే సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్లు 24 ఉంటాయి. 12 అటెండెంట్ల ఫ్లాట్లు ఉన్నాయి. ఈ సముదాయం కూడా ఆరు అంతస్తుల్లో ఉంది. ఒక్కో ఫ్లాట్‌ను 325 చ.అ.విస్తీర్ణంలో నిర్మించారు.

Next Story
Share it