Telugu Gateway
Cinema

‘గుణ 369’ టీజర్ విడుదల

‘గుణ 369’ టీజర్ విడుదల
X

కార్తికేయ మూడవ సినిమా ‘గుణ’. తొలి సినిమా ఆర్ఎక్స్ 100 దుమ్మురేపింది. ఆ తర్వాత చేసిన హిప్పీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అంతగా ఆదరణ పొందలేదు. ఇప్పుడు గుణ369గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. అర్జున్‌ జంధ్యాల డైరెక్షన్‌లో రాబోతోన్న గుణ 369 సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఫస్ట్‌ లుక్‌, పోస్టర్‌తో పాజిటివ్‌ టాక్‌ రాగా.. తాజాగా టీజర్‌ను విడుదల చేశారు.

‘మనం చేసే తప్పుల వల్ల మన జీవితానికి ఏమైనా పర్లేదు కానీ.. పక్కవారి జీవితానికి ఏం కాకుడదు’., ‘మేం మీలాంటి వారికి భయపడేది మాకు ఏమైనా జరుగుతుందనీ కాదు.. మా అనుకున్నవారికి ఏమైనా అవుతుందని’ అనే డైలాగ్‌లతో సినిమా థీమ్‌ ఏంటో మేకర్స్‌ హింట్‌ ఇచ్చేశారు. ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా అనగ నటించారు.

https://www.youtube.com/watch?v=p1nc-WWsSq4

Next Story
Share it