Telugu Gateway
Cinema

‘కల్కి’ ట్రైలర్ విడుదల

‘కల్కి’ ట్రైలర్ విడుదల
X

రాజశేఖర్..ఆదా శర్మ జంటగా నటించిన సినిమానే ‘కల్కి’. ఈ సినిమా జూన్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచింది. అందులో భాగంగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు యూనిట్. చాలా కాలం సరైన హిట్ లేక ఇబ్బంది పడ్డ సీనియర్ హీరో రాజశేఖర్ ‘గరుడవేగ’ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. అ! ఫేం ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో కల్కి సినిమా తెరకెక్కింది.

ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో ట్రైలర్‌ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోమవారమే ట్రైలర్‌ రిలీజ్‌ కావాల్సి ఉన్నా సాంకేతిక సమస్యల కారణంగా మంగళవారం ఉదయం రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నందితా శ్వేత, పూజితా పొన్నాడ, నాజర్‌, స్కార్లెట్‌ మెలిష్‌ విల్సన్‌, రాహుల్‌ రామకృష్ణ, అశుతోష్‌ రానా, శత్రులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సీ కల్యాణ్‌తో కలిసి రాజశేఖర్‌ స్వయంగా నిర్మించారు.

https://www.youtube.com/watch?v=LxveqQ4eipc

Next Story
Share it