Telugu Gateway
Andhra Pradesh

ప్రజల సొమ్ము అయితేనే స్పెషల్ ఫ్లైట్స్..!

ప్రజల సొమ్ము అయితేనే స్పెషల్ ఫ్లైట్స్..!
X

ప్రజల సొమ్ము అయితే స్పెషల్ ఫ్లైట్స్. ఐదేళ్ళ పాటు చంద్రబాబు ఎక్కే విమానం..దిగే విమానం అన్న చందంగా వందల కోట్ల రూపాయలను తన విమాన ప్రయాణాలకు ఖర్చు చేశారు. హెలికాఫ్టర్ లో వెళ్ళే దూరాలకు ప్రత్యేక విమానాలను వాడేశారు. ఇక చంద్రబాబు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనల ఖర్చు అయితే అంతే లేదు. అదేమని ప్రశ్నిస్తే రాష్ట్రం కోసం..పరిశ్రమల కోసం అంటూ జవాబులు. ఏకంగా పధ్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, పదేళ్ళ పాటు ప్రతిపక్ష నేతగా చేసిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం అవేమీ పట్టించుకోకుండా రెగ్యులర్ విమానాల్లో నే తిరుగుతున్నారు. చంద్రబాబుకు ఉన్న ఆస్తికి ఆయన ప్రత్యేక విమానాల్లో ఎన్ని రోజులు తిరిగినా తరిగిపోయేది ఏమీ కాదు. అందులో గత ఐదేళ్ళ కాలంలో చంద్రబాబు అండ్ కో చేసిన అవినీతి..అక్రమాలు అంతా ఇంతా కాదు. అయినా సరే సొంత సొమ్ము అనే సరికి ఎంత జాగ్రత్తో చూడండి.

ఇఫ్పుడు మాత్రం ఎయిర్ ఇండియా విమానాలు ఎక్కి అందరు ప్రయాణికులతో కలసి వస్తున్నారు. ఓ వైపు రాష్ట్రం కష్టాల్లో ఉందని..కట్టుబట్టలతో బయటకు వచ్చామని పేద కబుర్లు చెప్పిన చంద్రబాబు తన విలాసాల దగ్గరకు వచ్చేసరికి ఎక్కడా రాజీ పడలేదు. తన నివాస సముదాయాలు..గెస్ట్ హౌస్ లు..ప్రభుత్వ కార్యాలయాల్లో అంచనాలకు మించి మరీ కోట్లాది రూపాయల వ్యయం చేశారు. తాజాగా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లు వస్తున్న ఎయిర్ ఇండియా విమానం వాతావరణం అనుకూలించక బెంగుళూరు వెళ్ళింది. తర్వాత కొద్ది గంటలు వేచిచూసిన తర్వాత హైదరాబాద్ కు చేరుకుంది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విచిత్రం ఏమింటే ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబును ప్రత్యేక విమానాలు వాడారని విమర్శించిన జగన్ కూడా ఇప్పుడు ప్రత్యేక విమానాల్లోనే ప్రయాణిస్తున్నారు. మరి ఇదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తారా? లేదా అందులో ఏమైనా మార్పులు ఉంటాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it