Telugu Gateway
Politics

ఐఏఎస్ ల బదిలీలు...చంద్రబాబు టీమ్ కు షాక్!

ఐఏఎస్ ల బదిలీలు...చంద్రబాబు టీమ్ కు షాక్!
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీలో భారీ ఎత్తున పాలనలో కొత్తదనం కోసం చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు తలపెట్టారు. ఒకేసారి ఏకంగా నలభై మందికి పైగా ఐఏఎస్ లను బదిలీ చేశారు. అత్యంత కీలకమైన సాగునీటి శాఖ కు కొత్తగా ఆదిత్యనాథ్ దాస్ ను తీసుకొచ్చారు. అదే సమయంలో చంద్రబాబు హయాంలో ఓ వెలుగు వెలిగిన అధికారులు అయిన అజయ్ జైన్, విజయానంద్ లపై వేటు పడింది. వీళ్లిద్దరిని వారి వారి పదవుల నుంచి తప్పించారు. సీఆర్ డీఏ కమిషనర్ శ్రీధర్ కూడా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్తగా లక్ష్మీ నరసింహంను నియమించారు. ఇటీవల వరకూ చంద్రబాబు పేషీలో పనిచేసిన సీనియర్ అదికారులైన సతీష్ చంద్ర, రాజమౌళి, సాయిప్రసాద్ లకు ఇంకా పోస్టింగ్ లు ఇవ్వాల్సి ఉంది.

ఏపీ సర్కారు చేసిన బదిలీలు ఇలా ఉన్నాయి.

ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వెంకటేశ్వర ప్రసాద్

ఈఎఫ్ఎస్ అండ్ టీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్

జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాధ్థ్‌ దాస్

వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పూనం మాలకొండయ్య

బీసీ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కరకాల వలవన్

పరిశ్రమలు పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శిగా రజత్ భార్గవ.

వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా జవహర్ రెడ్డి

గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా అనంత రాము

యూత్ సర్వీసెస్, టూరిజం ప్రవీణ్ కుమార్

పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్

ట్రాన్స్ పోర్ట్, ఆర్ అండ్ బీ కృష్ణబాబు

స్త్రీ శిశు సంక్షేమ ముఖ్య కార్యదర్శిగా దయమంతి

పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా శ్యామలరావు

ట్రాన్స్ కో ఎండీగా నాగులాపల్లి శ్రీకాంత్

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఎంకే మీనా

జెన్‌కో ఎండీగా బి. శ్రీధర్

ఏహెచ్డీడీ అండ్ ఎఫ్ సెక్రటరీగా వెంకటేశ్వర ప్రసాద్

సివిల్ సప్లైస్ కమిషనరుగా కోన శశిధర్

హోం సెక్రటరీగా కిషోర్ కుమార్

వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా మధుసూదన్ రెడ్డి

జీఏడీ ముఖ్య కార్యదర్శిగా ఆర్పీ సిసోడియా

విజయానంద్, అజేయ్ జైన్ జీఏడీకి అటాచ్

శాప్ ఎండీగా కాటంనేని భాస్కర్

మార్కెటింగ్ స్పెషల్ కమిషనరుగా ప్రద్యుమ్న

ఎక్సైజ్ కమిషనర్ ఎం ఎం నాయక్

సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా హర్షవర్ధన్

వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌గా ప్రవీణ్ కుమార్

సీఎం ఓఎస్డీగా జె మురళీ

సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా విజయ

ట్రాన్సపోర్ట్ కమిషనరుగా పీఎస్సార్ ఆంజనేయులు

హర్టీకల్చర్.. సెరీకల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి

వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా పీయూష్ కుమార్

ఇంటర్ విద్య కమిషనర్‌గా కాంతిలాల్ దండే

మున్సిపల్ శాఖ కమిషనర్‌గా విజయ్ కుమార్

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌గా గిరిజా శంకర్

సీఆర్డీఏ కమిషనర్‌గా లక్ష్మీ నరసింహం

జిల్లా కలెక్టర్లు

ప్రకాశం- పి భాస్కర్‌

తూర్పు గోదావరి- మురళీధర్‌రెడ్డి

పశ్చిమ గోదావరి- ముత్యాల రాజు

గుంటూరు- శ్యామూల్‌ ఆనంద్‌

నెల్లూరు- ఎంవీ శేషగిరిబాబు

అనంతపురం- ఎస్‌ సత్యనారాయణ

విశాఖపట్నం- వి వినయ్‌చంద్‌

కర్నూలు- జి వీరపాండ్యన్‌

చిత్తూరు- నారాయణ భరత్‌ గుప్తా

Next Story
Share it