Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో ఉగాది నాటికి ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం

ఏపీలో ఉగాది నాటికి ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం
X

కలెక్టర్ల సమావేశం వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తమ ప్రభుత్వ పాలన లక్ష్యాలను కలెక్టర్లకు విస్పష్టంగా చెప్పారు. రాబోయే రోజుల్లో పాలన ఎలా ఉండాలి..ఎవరు ఏమి చేయాలి అని నిర్దేశించారు. సమావేశంలో జగన్ ఆదేశాల్లోని ముఖ్యాంశాలు..‘ఉగాది కి ఇంటి స్థలం లేని వారు ఎవరు రాష్ట్రం లో ఉండకూడదు...25 లక్షల ఇంటి స్థలాలు మహిళ పేరుతో ఇవ్వాలి. పట్టా చేతి లో ఉంటుంది...కానీ స్థలం ఉండదు... దృష్టి పెట్టి ఎక్కడ ఎంత అవసరం గుర్తించి ఉగాది నాటికి రిజిస్టర్ ప్లాట్ ఇవ్వాలి. క్రెడిబిలిటీ అనే పదానికి విలువ ఉండాలి. తన లేదు మన లేదు పాలసీ కచ్చితం గా పాటించండి. జిల్లా పోర్టల్ తీసుకు రావాలి..మండలం నుండి గ్రామ స్థాయి వరకు పోలీస్, జ్యూడిషరీ తో సహా అన్ని తీసుకురండి...చేసే అభివృద్ధి పనుల ను కూడా పొందుపరచండి.. కలెక్టర్లు సమగ్రంగా భూముల పై ల్యాండ్ ఆడిట్ నిర్వహించండి. ఇది ఎంతో అవసరం.

ఇతర శాఖల నుండి ఫీడ్ బాక్ తీసుకోండి. రాజ్యాంగం, చట్టం , న్యాయాలను ను తుంగలో తొక్కారు. 23 మంది ఎమ్మెల్యే ల ను తీసుకెళ్లి వారి ద్వారా మీ పై పెత్తనం చేస్తారు.ఎంపీటీసీ,కౌన్సిలర్లను తీసులెళ్లి పదవులు పొందుతారు. మీరు ఎన్నికలు సజావు గా ఎలా జరుపుతారు. ప్రభుత్వ ఉద్యోగులు పట్ల గౌరవం అభిమానం పెరగాలి. ఈ సమావేశానికి వచ్చే టప్పుడు తెలిసిన కొంతమందిని అడిగా మార్పు రావాలి అన్నారు. నేను చనిపోయినా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి..ఇదే నా ఆశయం. పారదర్శకత, ఫ్రెండ్లీ ప్రభుత్వం గా ఉండాలి. చిరునవ్వు తో ఉండండి అదే మంచి జరుగుతుంది.

ప్రతి సోమవారం స్పందన పేరుతో పిర్యాదు లను స్వీకరించండి...ఆ రోజూ ఏ మీటింగ్ లు ఉండవద్దు. పిర్యాదు తీసుకోగానే రసీదు ఇవ్వండి..ఫోన్ నెంబర్ తీసుకోండి... గడువు కూడా ఇవ్వండి. నేను కూడా రచ్చబండ నిర్వహిస్తా...రాండమ్ గా చెకింగ్ చేస్తా...పై స్థాయి వారు కూడా రాండమ్ ఛెక్ చేయండి. మొక్కుబడి గా కాకుండా సమర్థవంతం గా నిర్వహించాలి. ప్రతి 3 శుక్రవారం మన దగ్గర పనిచేసే సిబ్బంది కోసం కేటాయించండి..సమస్యలను పరిష్కరించండి. కలెక్టర్లు వారానికి ఒక సారి హాస్టల్, పి హె చ్ సి, స్కూల్స్ ను సందర్శించండి...ఒక రోజు నిద్ర చేయండి... తెల్లారి ప్రజలతో మమేకం అవ్వండి. మీరు బస చేసిన ప్రాంతంలో ఇప్పుడు,అప్పుడు ఫోటోలు చూపండి. విద్య, వైద్యం, రైతులు కే ప్రధాన ప్రాధాన్యత ఉంటుంది.’ అని సూచించారు.

Next Story
Share it