నాని...రెడీ

హీరో నాని బిజీ షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నారు. వరస పెట్టి సినిమాలు చేస్తూ గ్యాప్ లేకుండా దూసుకెళుతున్నారు. ఈ సక్సెస్ ఫుల్ హీరో ప్రస్తుతం ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా 2019ఆగస్టు 30నే ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్యాంగ్ లీడర్ షూటొంగ్ పూర్తి చేసుకుని జూలై నుంచి నాని ‘వీ’ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో నానితోపాటు మరో హీరో సుధీర్ బాబు కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అదితీరావు హైదరీ, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సుధీర్‌బాబు వర్కౌట్స్ చేసి బరువు కూడా తగ్గారు. ఇందులో సుధీర్‌బాబు పోలీసాఫీసర్‌గా కనిపిస్తారని, నానిది విలన్ పాత్ర అనిసమాచారం. శ్రీవెంకటేశ్వర కియేషన్స్ పతాకంపై అనిత సమర్పణలో శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.