ముందు జగన్..తర్వాత చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బుధవారం నాడు కోలాహాలంగా మారింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం..కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో ఆయా నేతల అభిమానులు..సందర్శకులతో అసెంబ్లీ లాబీలు కిక్కిరిసి పోయాయి. సభ తొలి రోజు కొత్త సభ్యుల ప్రమాణ స్వీకరాలతోనే ముగిసింది. తొలుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ శాసనసభా నాయకుడు చంద్రబాబు ప్రమాణ స్వీకారంచేశారు. అనంతరం మంత్రులు..ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రొటెం స్పీకర్ అప్పల నాయకుడు కొత్త సభ్యులతోప్రమాణ స్వీకారంచేయించారు. గురువారం నాడు స్పీకర్ ఎన్నిక జరగనుంది.
అధికార పార్టీ ఇప్పటికే స్పీకర్ గా సీనియర్ నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం పేరును ఖరారుచేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ ఎన్నిక కూడా లాంఛనప్రాయంగానే ముగియనుంది. ఎందుకంటే151 మంది సభ్యులతో వైసీపీ ఉన్నందున పోటీకి ఛాన్సే లేదు. స్పీకర్ ఎన్నిక తర్వాత గురువారం నాడు సభ మరుసటి రోజుకువాయిదా పడనుంది. ఈ నెల14న గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించున్నారు.