Telugu Gateway
Top Stories

వర్జీనియా బీచ్ లో కాల్పులు

వర్జీనియా బీచ్ లో కాల్పులు
X

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం. ఈ సారి వర్జీనియా బీచ్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఏకంగా 12 మంది మరణించారు. కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వర్జీనియా బీచ్ సిటీలో ప్రభుత్వ భవనం ముందు ఈ దారుణం చోటుచేసుకుంది.

బిల్డింగ్ లో తుఫాకీతో వచ్చిన వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఇందులో ఓ పోలీసు అధికారి గాయపడగా..12 మందికి అక్కడికి అక్కడే మరణించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులకు తెగబడిన వ్యక్తిని చంపేశారు. అదే భవనంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తే ఈ దారుణానికి కారణమైనట్లు పోలీసులు గుర్తించారు. అయితే కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.

Next Story
Share it