Telugu Gateway
Politics

కోర్టుకెక్కిన ‘సీఎల్పీ విలీన’ పంచాయతీ

కోర్టుకెక్కిన ‘సీఎల్పీ విలీన’ పంచాయతీ
X

అధికార టీఆర్ఎల్ లో ఫిరాయింపు కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరిక వ్యవహారం హైకోర్టు గడప తొక్కింది. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ప్రకటించిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అదే పని చేసింది. ఈ చేరికలను సమర్ధించుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ కూడా ఈ చేరికలు తప్పు అనుకుంటే అందుబాటులో ఉన్న ఫోరాలను ఆశ్రయించవచ్చంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తమ పిటీషన్ ను అత్యవసరంగా విచారించాలని కాంగ్రెస్ పార్టీ కోరగా..మంగళవారం నాడు విచారణ జరిపేందుకు హైకోర్టు సమ్మతించింది. టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో సిఎల్పీ విలీనాన్ని సవాల్ చేస్తూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్కలు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

స్పీకర్ జారీ చేసిన విలీన ఉత్తర్వులను రద్దు చేయాలని వీరు హైకోర్టును అభ్యర్ధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు ఇటీవల ఓ లేఖ ఇచ్చి టీఆర్ఎస్ లో విలీనం అయిన విషయం తెలిసిందే. స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం అని..సిఎల్పీ తీర్మానం లేకుండానే 12 మంది ఎమ్మెల్యేలు విలీనం చేయమని కోరటం..స్పీకర్ దాన్ని ఆమోదించటం చట్టబద్ధం కాదని పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు కోర్టును కోరారు.

Next Story
Share it