Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

విదేశీ పర్యటనకు చంద్రబాబు

0

తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళ్ళారు. బుధవారం తెల్లవారుజామున ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఐరోపా దేశాల పర్యటనకు వెళ్ళినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఆయన విదేశీ పర్యటన ఈ నెల ప్రారంభంలోనే తలపెట్టినా అసెంబ్లీ సమావేశాల కారణంగా వాయిదా వేసుకున్నారు.ఐదు రోజుల పాటు జరిగిన  అసెంబ్లీ సమావేశాలు మంగళవారం తో నిరవధికంగా వాయిదా పడ్డాయి.

- Advertisement -

ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం తర్వాత విశ్రాంతి కోసం ఆయన ఈ పర్యటన పెట్టుకున్నారు. ఈ నెల 24న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని చెబుతున్నారు.  వాస్తవానికి అన్ని పార్టీల అధినేతలతో బుధవారం నాడు ఢిల్లీలో ప్రధాని మోడీ సమావేశం తలపెట్టారు. దీనికి చంద్రబాబు హాజరుకాకుండా..పార్టీ అభిప్రాయాలను లేఖ ద్వారా తెలియజేయాలని నిర్ణయించుకున్నారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.