Telugu Gateway
Cinema

మళ్ళీ మా బిగ్ బాస్ ‘నాగార్జునే’

మళ్ళీ మా బిగ్ బాస్ ‘నాగార్జునే’
X

‘ఈ సారి రంగంలోకి దిగేది నాగార్జునే’ అంటూ స్టార్ మా ప్రకటించింది. త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ 3 షోను ఆయనే హోస్ట్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంతే కాదు..దీనికి సంబంధించి నాగార్జునతో చేసిన ప్రొమోను కూడా విడుదల చేసింది స్టార్ మా. గత రెండు సీజన్లుగా తెలుగు నాట బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. నాగార్జున మీద చిత్రీకరించిన ఓ ప్రోమోను శుక్రవారం సోషల్‌ మీడియాలో విడుదల చేసింది.

‘గుడ్లు ఇవ్వు...ఆకలేస్తే తింటారు.. అలిగితే వాటితోనే కొట్టుకుంటారు’, ‘నవ నవ లాడే లేత వంకాయలు ఓ పాతిక కిలోలు ఇవ్వు’ అంటూ నాగర్జున బిగ్‌బాస్‌ హౌస్‌ మెంబర్స్‌ కోసం సరకులు కొంటున్నట్టుగా ఇందులో చూపించారు. షోలో 14 మంది కంటెస్టెంట్లు ఉండనున్నట్టు, 100 రోజుల సాగనున్నట్టు నాగార్జున ఈ ప్రోమోలో తెలిపారు. వారి పేర్లు త్వరలోనే బహిర్గతం కానున్నాయి.

Next Story
Share it