Telugu Gateway
Andhra Pradesh

అమరావతి ప్రస్తావన ఏది?

అమరావతి ప్రస్తావన ఏది?
X

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. గత ఐదేళ్ళ కాలంలో తాము సుపరిపాలన అందించామని అచ్చెన్నాయుడు చెప్పగా..అవును ఓ ఆస్పత్రిలో ఎలుకలు చంపేందుకు 8.5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇదే సుపరిపాలన అంటూ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పట్టిసీమ వ్యవహారం కూడా చర్చకు వచ్చింది. అధికార పార్టీకి పట్టిసీమ వద్దంటే మోటార్లు ఆపు చేయండి..అప్పుడు రైతులు చెబుతారు అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందిస్తూ ఏ ప్రాజెక్టు కట్టినా కొంత ఉపయోగం ఉంటుందని..తాము ప్రస్తావించింది పట్టిసీమ అవినీతి, తాత్కాలిక ప్రాజెక్టు ల అంశాన్ని మాత్రమే అని తెలిపారు. ఈ డబ్బును పోలవరానికి ఖర్చు పెట్టి ఉంటే పనులు వేగంగా సాగేవన్నారు.

దీంతోపాటు అచ్చెన్నాయుడు అమరావతి అంశాన్ని కూడా ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగంలో రాజధాని అమరావతి గురించి ఒక్క లేకపోవడం బాదాకరమని అన్నారు. ఈ రోజు మీరు ఇక్కడ పాలన చేయగలుగుతున్నారంటే అది చంద్రబాబు నిర్మించిన సచివాలయ భవనాల వల్ల,ఈ రోజు ఇక్కడ అసెంబ్లీలో కూర్చున్నామంటే అది చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన భవనాల వల్ల అని ఆయన అన్నారు. కానీ అమరావతి రాజధాని గురించి ఒక్క మాట కూడా లేకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. రాజదానిని ఏ రకంగా అబివృద్ది చేస్తారో చెప్పాలని కోరుతున్నామని ఆయన అన్నారు. అయితే వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు ఓటుకు నోటు కేసు అని ఎద్దేవా చేశారు.

Next Story
Share it