Telugu Gateway
Andhra Pradesh

‘ఆ పేద చంద్రబాబు’పై ప్రజలకెంత ప్రేమో!

‘ఆ పేద చంద్రబాబు’పై ప్రజలకెంత ప్రేమో!
X

నారా దేవాన్ష్ ఆస్తి 19 కోట్లు. నారా లోకేష్ ఆస్తి 320 కోట్ల రూపాయలు. చంద్రబాబునాయుడు దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రి అని ఆయన సీఎంగా ఉన్న రోజుల్లో ఓ నివేదిక తేల్చింది. ఇప్పుడు ఈ లెక్కలు అన్నీ ఎందుకు అంటారా?. ఉంది. అక్కడే ఉంది అసలు సంగతి. ఇదే చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ లో కోట్ల రూపాయలు పెట్టి అత్యంత విలాసవంతమైన భవనం కట్టుకున్నారు. ఇప్పుడు కరకట్టపై ఉన్న ఆయన ఇంటి లోపల చూస్తే కూడా కళ్ళు తిరగాల్సిందే. అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి జగన్ సర్కారు దూకుడు మీద ఉండటంపై చంద్రబాబు మళ్ళీ తనదైన శైలిలో ‘సానుభూతి యాత్ర’లకు శ్రీకారం చుట్టినట్లు కన్పిస్తోంది.

అదేంటి అంటే ‘మీరు ఎక్కడ కోరితే అక్కడ 3400 గజాలు ఇస్తాం. మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్లనీయం. రాజధానికి 34 వేల ఎకరాలు ఇచ్చిన వాళ్ళకు మాకు ఇది పెద్ద కష్టమా?’ అని రాజధాని రైతులు అన్నారట. ఎందుకు చంద్రబాబు నిజంగా అమరావతిలో స్థలం కొనుక్కుని ఇళ్ళు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారా?. వాళ్ళ ఫ్యామిలీ అంత ఆర్ధిక కష్టాల్లో ఉందా?. ఇదొక్కటే కాదు సుమా..టీడీపీ నేతలు కొంత మంది కూడా మా ఇంటిని చంద్రబాబుకు ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. వీటి అన్నింటి ద్వారా తెలుగుదేశం పార్టీ ఏమి ఆశిస్తోంది. నిజంగా ఇప్పుడు చంద్రబాబుకు అమరావతిలో 3400 గజాలు ఇస్తామని చెబుతున్న వారిలో ఎవరైనా నిజమైన పేదవాడు అడిగితే అందులో ఎవరైనా సాయం చేస్తారా?.

నిజంగా చంద్రబాబు ఐదేళ్ళ పాలన అంత నిజాయతీగా సాగిందా?. ప్రజల సొమ్మును అత్యంత విలాసవంతంగా ఇష్టానుసారం వాడేసి..ప్రతి స్కీమ్ లోనూ స్కాములు చేసిన చంద్రబాబు ఇళ్ళు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారా?. చంద్రబాబు నివాసం ఉన్న ఇంటికి జగన్ సర్కారు నోటీసులపై ఇప్పుడు గగ్గోలు పెడుతున్న టీడీపీ నేతలు..2014 అధికారంలో వచ్చాక చేసిన హంగామాను అంత తేలిగ్గా మర్చిపోతే ఎలా?. అప్పటి సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కరకట్ట ప్రాంతాన్ని సందర్శించి..అన్నీ అక్రమ నిర్మాణాలు అని..వెంటనే వాటిని తొలగిస్తామని హంగామా చేశారు.

చంద్రబాబు ఆ అక్రమ నివాసంలో చేరగానే..అక్రమాలు అన్నీ సక్రమం అయిపోయాయి. వాస్తవ పరిస్థితులను బట్టి కాకుండా నిత్యం ఇలాంటి ‘సెంటిమెంట్ రాజకీయాలు’ చేస్తే నమ్మటానికి ప్రజలు ఏమైనా పిచ్చొళ్ళా అని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా చంద్రబాబు వైఖరిలో మార్పేమీ రాలేదని టీడీపీ నేతలు అభిప్రాయపడుతుంటే..కొంత మంది నేతలు మాత్రం ‘అంతేగా...అంతేగా’ అంటూ నిట్టూర్పులు విడుస్తున్నారు మరి రాజధాని రైతులు చెబుతున్నట్లు ఇటుక ఇటుక మీద చంద్రబాబు పేరు ఉంటే ఆ ప్రాంతంలో కూడా టీడీపీకి ఎందుకు సీట్లు రాాలేదు?. అంటే ఎక్కడో లెక్క మిస్ అవుతోంది. ఆ మిస్ అవుతున్న లెక్కను పట్టుకోకుండా..సానుభూతి రాజకీయాలు చేస్తూ ఉంటే భవిష్యత్ కష్టమే అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it