Telugu Gateway
Cinema

అల్లు అర్జున్ ‘ఖరీదైన కార్ వాన్’

అల్లు అర్జున్ ‘ఖరీదైన కార్ వాన్’
X

టాలీవుడ్ లోనే అత్యంత ఖరీదైన ‘కార్ వాన్’ ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దగ్గరే ఉందా?. అంటే ఔనని చెబుతున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం ఈ హీరో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇది అల్లు అర్జున్ 19వ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అందరి కన్ను అల్లు అర్జున్ కార్ వాన్ పైనే ఉంది. AA అనే అక్ష‌రాల‌తో ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన ఈ క్యారీ వ్యాన్ రూ.7కోట్ల వ్య‌యంతో రూపొందిందని సమాచారం.

రూ3.5 కోట్లు ఖ‌ర్చు పెట్టి కొన్న ఈ కార్ వాన్‌ను ముంబయ్ కి చెందిన ఇంటీరియ‌ర్ ప్ర‌త్యేకంగా డిజైన్ చేశార‌ట‌. ఇంటీరియ‌ర్ డెక‌రేష‌న్‌కు మూడున్న‌ర కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టార‌ని చెబుతున్నారు. దేశంలో మ‌రే హీరో దగ్గర కూడా ఇంత ల‌గ్జ‌రీ కార్ వాన్ లేదని టాక్. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. 'జులాయి', 'స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి' చిత్రాల త‌ర్వాత బ‌న్ని, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రం కావటంతో ఈ సినిమాపై కూడా అల్లు అర్జున్ అభిమానుల్లో భారీ ఆశలే ఉన్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Next Story
Share it