Telugu Gateway
Andhra Pradesh

జగన్ కీలక నిర్ణయం

జగన్ కీలక నిర్ణయం
X

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరో పది రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు రానున్న తరుణంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వెనక జగన్ ధీమా కూడా కన్పిస్తోందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి కూడా వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆ పార్టీ నేతలు తాము అధికారంలోకి రావటం ఖాయం అని గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే వాళ్ళు ప్రశాంతంగా ఏమీ మాట్లాడకుండా ఉంటే..అధికార టీడీపీ మాత్రం నానా హంగామా చేస్తోంది. ఈ అంశాలు అన్నింటిని పక్కన పెడితే ఇప్పుడు వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని అమరావతికి షిఫ్ట్ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రస్తుతం లోటస్ పాండ్ లోని వైసీపి ఆఫీస్ నుండి ఫర్నిచర్ ను ఉండవల్లి లోని వైసీపి కార్యాలయానికి తరలింపు ప్రారంభించారు.

ఈ నెల 16 న వైసీపి ఎంపీ ఎమ్మెల్యే కౌంటింగ్ ఏజెంట్ల కు విజయవాడ లో శిక్షణ కార్యక్రమం కొనసాగనుంది. ఈనెల 21లోగా పార్టీ కీలక నేతలను విజయవాడ లో ఉండేలా ఆదేశాలు. ఈనెల 22న ఉండవల్లికి జగన్ వెళ్లనున్నారు. 22 నుంచి పార్టీ కార్యకలాపాలు ఉండవల్లి కార్యాలయం నుంచే ప్రారంభం కానున్నాయి. మే23న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న విషయం తెలిసిందే. వైసీపీకి 110 పైనే అసెంబ్లీ సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అదే సమయంలో ఎంపీ సీట్లు కూడా 18 నుంచి 20 వరకూ వస్తాయనే ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఈ తరుణంలో జగన్ నిర్ణయం కీలకంగా మారింది.

Next Story
Share it