Telugu Gateway
Politics

గవర్నర్ తో జగన్ భేటీ

గవర్నర్ తో జగన్ భేటీ
X

వైసీపీ శాసనసభాపక్ష నేత జగన్మోహన్ రెడ్డి శనివారం మధ్యాహ్నాం హైదరాబాద్ లో గవర్నర్ నరసింహన్ తో సమావేశం అయ్యారు. శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా రాజ్‌భవన్‌ వెళ్లారు. వైఎస్సార్‌ ఎల్పీ తీర్మాన ప్రతిని అందచేసిన జగన్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు.

వైఎస్‌ జగన్‌తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్‌ కూడా గవర్నర్‌ను కలిశారు. కాగా మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సాఆర్‌ సీపీ 151, తెలుగుదేశం పార్టీ 23, జనసేన పార్టీ 1 స్థానాన్ని గెలిచిన విషయం తెలిసిందే.

Next Story
Share it