మే 24న ‘సీత’ వస్తోంది
BY Telugu Gateway5 May 2019 6:20 PM IST
X
Telugu Gateway5 May 2019 6:20 PM IST
సీత రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మే 24న సీత వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కీలక పాత్ర పోషింది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్. సోనూసూద్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ ఓ ప్రత్యేక గీతంలో నటించింది. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించంగా డైరెక్టర్ తేజ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. గత కొంత కాలంగా బెల్లంకొండ శ్రీనివాస్ ఫలితాలతో సంబంధం లేకుండా వరస పెట్టి సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
Next Story