Telugu Gateway
Andhra Pradesh

సింగపూర్ కంపెనీలు చంద్రబాబు ఓటమిని స్మెల్ చేశాయా!?

సింగపూర్ కంపెనీలు చంద్రబాబు ఓటమిని స్మెల్ చేశాయా!?
X

అమరావతిలో 1,691 ఎకరాలు. మౌలికసదుపాయాల కల్పనకు ఐదు వేల కోట్ల రూపాయల వరకూ సర్కారు సాయం. ఇంత చేసినా అందులో సర్కారు వాటా 42 శాతం మాత్రమే. వీటికితోడు అన్నీ ఉచిత అనుమతులు..ఉచిత ఇసుకులు. సింగపూర్ కంపెనీల ప్రయోజనాల కోసం ఏకంగా ఏపీలోని చట్టాలను మార్చేశారు. అడ్డం చెప్పిన అధికారుల అభ్యంతరాలను బేఖాతర్ అన్నారు. అన్నీ కేబినెట్ లో పెట్టి ఓకే చేశారు. అదే అమరావతిలో ‘స్టార్టప్ ఏరియా’. స్టార్టప్ ఏరియా అంటే అదేదో రాజధాని భవనాలకు సంబంధించిన వ్యవహారం అనుకుంటే పూర్తిగా పొరపడినట్లే. అది పూర్తిగా ప్రైవేట్ వ్యాపారం. ఇందులో భాగస్వామిగా ఉన్నది అసెండాస్-సెంబ్ కార్ప్-సింగ్ బ్రిడ్జిల కన్సార్షియం. ఆ సంస్థలు పెట్టే పెట్టుబడి పెట్టే మొత్తం కూడా కేవలం 300 కోట్ల రూపాయల మేరకే. మిగతా మొత్తం సర్కారు ఇచ్చిన భూములను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకోవటానికి సర్కారు అనుమతి ఇచ్చింది. అయినా కూడా సింగపూర్ కంపెనీలు ఏపీలో ‘స్టార్టప్ ఏరియా’కు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడేలా పనులు ప్రారంభించలేకపోయింది.

దీనికి కారణం ఏంటి అంటే తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మళ్ళీ అధికారంలోకి వస్తారో రారో అన్న అనుమానంతోనే ఈ పనిచేశారు. వాళ్ళు ఆ విషయాన్ని చాలా ముందుగానే స్మెల్ చేశారని..అందుకే ఏ మాత్రం రిస్క్ తీసుకోవటానికి సిద్ధం లేకే ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతంలో కూడా ఈ విషయాన్ని తెలుగుగేట్ వే. కామ్ వెలుగులోకి తెచ్చింది. మరి ఆ కంపెనీలు ఊహించినట్లే చంద్రబాబు దారుణ పరాజయాన్ని చవిచూశారు. ఇఫ్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. మరి సింగపూర్ కంపెనీలు ఇప్పుడు కూడా ముందుకు వస్తాయా?. వచ్చినా ప్రతిపక్షంలో ఉండగా ఈ తీరును తప్పుపట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తారా?.

కాదు..కూడదు అని రద్దు చేయాలి అంటే..అందుకే వీల్లేకుండా కూడా చంద్రబాబు సింగపూర్ కంపెనీలకు అనుకూలంగా ఒప్పందంలోనే పలు అంశాలను చంద్రబాబు సర్కారు జొప్పించింది. అంతే కాదు..ఏకంగా సింగపూర్ కేంద్రంగా సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్ మెంట్ హోల్డింగ్స్ (ఎస్ఏఐహెచ్) పేరుతో స్పెషల్ పర్సస్ వెహికల్ (ఎస్పీవీ)ని ఏర్పాటు చేసింది. మరి ఈ చిక్కుముడులు అన్నీ ఎప్పుడు విడిపోతాయి. ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతుందా? అంటే వేచిచూడాల్సిందే. ఈ అంశాలపై జగన్ దృష్టి పట్టడానికి సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఈ అంశంపై కొత్త ప్రభుత్వంతో చర్చలు జరుపుతారా?. ఇందులో చంద్రబాబు సలహాలు..సూచనలు ఏమైనా ఉంటాయా ఏమి జరుగుతుందో వేచిచూడాల్సిందే. సింగపూర్ కంపెనీలతో కలసి చంద్రబాబు భారీ స్కాంకు స్కెచ్ వేశారనే విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

Next Story
Share it