Telugu Gateway
Cinema

‘సాహో’ టీమ్ కు షాక్

‘సాహో’ టీమ్ కు షాక్
X

ఓ వైపు చిత్ర యూనిట్ విడుదల తేదీని ప్రకటించి..ఫస్ట్ లుక్ విడుదల చేసింది. సోమవారం నాడే ప్రభాస్ కు సంబంధించిన మరో ఆసక్తిమైన పోస్టర్ ను కూడా విడుదల అయింది. సాహో సినిమా ఆగస్టు 15న విడుదల అవుతుందని తేల్చిచెప్పింది టీమ్ సాహో. ఈ తరుణంలో ఉరుముల్లేని పిడుగులా ఓ సంచలన వార్త వెలువడింది. అదేంటి అంటే ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్న టీమ్ గుడ్ బై చెప్పేసింది. సాహో చిత్రానికి శంకర్‌, ఇషాన్‌ నూరని, లాయ్‌ మెన్‌డోన్సా త్రయాన్ని సంగీత దర్శకులుగా ఎంచుకున్నారు. అయితే విడుదల తేదీ దగ్గరపడుతుండగా.. ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు సంగీత దర్శకులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం ప్రభాస్ అభిమానుల్లో కలకలం రేపుతోంది.

మరి వీరి నిష్క్రమణకు కారణాలు మాత్రం వెల్లడించలేదు. యూనిట్‌ నుంచి బయటకు వెళ్తూ.. ప్రభాస్‌, సుజిత్‌, వంశీ, ప్రమోద్‌, శ్యామ్‌లకు ఆల్‌ది బెస్ట్‌ చెప్పారు. మరి వీరి స్థానంలో ఎవరిని తీసుకుంటారో వేచి చూడాలి. ఇంత సడన్ గా వీరి వైదొలగటం వెనక కారణాలు ఏమై ఉంటాయన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. మూడు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల జాప్యం అవుతుందా? లేక ముందు ప్రకటించినట్లుగానే చిత్ర యూనిట్ ఆగస్టు 15నాటికి సినిమా విడుదల చేయగలుగుతుందా? వేచిచూడాల్సిందే.

Next Story
Share it