అదరగొడుతున్న ‘రణరంగం’ ఫస్ట్ లుక్
BY Telugu Gateway26 May 2019 5:25 AM GMT

X
Telugu Gateway26 May 2019 5:25 AM GMT
శర్వానంద్. విలక్షణ నటుడు. కథల ఎంపికలో కూడా కొత్తదనం చూపిస్తూ..హంగామా చేయకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళే ఏకైక హీరో. ఇప్పుడు ‘రణరంగం’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రంగా తెరకెక్కుతున్న సినిమానే ఇదే.
ఈ చిత్రానికి ‘రణరంగం’ ఖరారు చేశారు. ఈ సినిమాలో శర్వానంద్ రెండు గెటప్స్ లో కనిపించనున్నారు. ఫస్ట్ లుక్‌లో మధ్య వయసులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌లా ఏదో తీక్షణంగా ఆలోచిస్తూ పొగను వదులుతున్నారు శర్వానంద్. ఈ చిత్రాన్ని నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించారు. కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ కథానాయికలు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2న రిలీజ్ చేయనున్నారు.
Next Story