‘ఓ బేబీ’గా సమంత

సమంత. టాలీవుడ్ లో దూసుకెళుతున్న హీరోయిన్. ఈ మధ్య కాలంలో పూర్తిగా హిట్ ట్రాక్ లో ఉన్న ఈ భామ ఇప్పుడు కొత్తగా ‘ఓ బేటీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో సమంత పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సురేశ్ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్, క్సాస్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.
విజయ్ దొంకాడ, దివ్యా విజయ్ సహ–నిర్మాతలు. ‘‘ఇండస్ట్రీలో 55 ఏళ్ల లెజెండరీ జర్నీని కంప్లీట్ చేసుకున్న సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థకు శుభాకాంక్షలు. ఈ సంస్థ తర్వాతి చిత్రం ‘ఓ బేబి’లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నేను చేసిన స్వాతి పాత్ర లుక్ను విడుదల చేశాం’’ అని పేర్కొన్నారు సమంత. ‘‘పేరు స్వాతి.. తనతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదు’’ అని సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ పేర్కొంది.