Telugu Gateway
Cinema

జూన్ 5న సాహో కొత్త టీజర్

జూన్ 5న సాహో కొత్త టీజర్
X

సాహో విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదు. ముందు ప్రకటించినట్లుగానే ఈ సినిమా ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. అదే సమయంలో జూన్ 5న సినిమా కొత్త టీజర్ ను విడుదల చేయాలని నిర్ణయించారు. చివరి నిమిషంలో చిత్ర సంగీత దర్శకులు శంకర్‌ ఇషాన్‌ లాయ్‌లు ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. దీంతో సినిమా విడుదల ఆలస్యమవుతుందన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే వార్తలపై చిత్ర దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాహో విడుదల తేదీలో మార్పుండదన్నారు.

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన భారత్‌ సినిమాతో పాటు సాహో టీజర్‌ను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రన్ రాజా రన్‌ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా మరో బ్యూటీ ఇవ్లిన్‌ శర్మ కీలక పాత్రలో నటిస్తోంది.

Next Story
Share it