Telugu Gateway
Cinema

రష్మిక ‘రేంజ్ మారిపోయింది’

రష్మిక ‘రేంజ్ మారిపోయింది’
X

రష్మిక మందన. ఈ మధ్య టాలీవుడ్ జపం చేస్తున్న పేరు. ఆమె చేస్తున్న సినిమాలు అన్నీ వరస పెట్టి హిట్స్ అవుతుండటంతో నిర్మాతలు కూడా ఆమె వెంట పడుతున్నారు. తొలి సినిమా ‘‘ఛలో’ తోనే హిట్ అందుకుంది ఈ భామ. తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన ‘గీత గోవిందం’ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ లో ‘డియర్ కామ్రెడ్’ సినిమా వస్తోంది. వరసగా వస్తున్న ఆఫర్లు..హిట్ లతో రష్మిక తన రెమ్యునరేషన్ రేంజ్ ను పెంచిందని టాలీవుడ్ టాక్.డియర్‌ కామ్రేడ్‌లో ఆమె రూ 80 లక్షలు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె విజయ్‌ దేవరకొండతో కలిసి నటించిన డియర్‌ కామ్రేడ్‌ విడుదల కోసం వేచిచూస్తున్నారు.

హిట్‌ జోడీగా వారికి పేరుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరోవైపు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సరసన సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీలో కూడా రష్మిక అభిమానులకు కనువిందు చేయనున్నారు. అయినా కూడా హీరోలతో పోలిస్తే హీరోయిన్ల పారితోషికం చాలా తక్కువగానే ఉంటుంది. టాప్ హీరోయిన్లకు మాత్రం టాలీవుడ్ లో కోట్లలో రెమ్యునరేషన్ ఇస్తారు. రష్మిక త్వరలోనే ఆ రేంజ్ కు చేరుకోవటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it