Telugu Gateway
Politics

మోడీ..కర్మ ఫలితం మీ కోసం ఎదురుచూస్తోంది

మోడీ..కర్మ ఫలితం మీ కోసం ఎదురుచూస్తోంది
X

దివంగత రాజీవ్ గాంధీపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. ఒకప్పుడు రాజీవ్ ను మిస్టర్ క్లీన్ గా అభివర్ణించేవారు..చివరికి ఆయన నెంబర్ వన్ అవినీతిపరుడయ్యారు అంటూ మోడీ వ్యాఖ్యానించి కలకలం రేపారు. మోడీ యుద్ధం ముగిసింది. కర్మ ఫలితం మీ కోసం ఎదురుచూస్తోంది. మా తండ్రి మీద మీరు చేసిన వ్యాఖ్యల ద్వారా మీరేంటో చెబుతున్నాయి.

ఇక మిమ్మల్ని ఏమీ కాపాడలేవు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రధాని స్థాయి వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని ప్రియాంక గాంధీ ట్విట్టర్ లో కామెంట్ పోస్ట్ చేశారు. ప్రధాన మంత్రి అమరులైన వారి పేర్లు చెప్పుకుని ఓట్లు రాబట్టుకోవాలనుకుంటున్నారు. కానీ అమరులకు మాత్రం గౌరవం ఇవ్వరు. మీకు ప్రజలే సమాధానం చెబుతారు అని వ్యాఖ్యానించారు మోడీ మోసాన్ని ఈ దేశం ఎప్పుడూ క్షమించదు అని పేర్కొన్నారు.

Next Story
Share it