Telugu Gateway
Cinema

ముగ్గురు హీరోయిన్లతో దర్శకేంద్రుడి సినిమా

ముగ్గురు హీరోయిన్లతో దర్శకేంద్రుడి సినిమా
X

అనారోగ్యం కారణంగా ఎస్వీబీసీ ఛానల్ ఛానల్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తాను చెప్పింది అబద్ధం అని చెప్పకనే చెప్పేశారు. నిజంగా అనారోగ్యం కారణం అయితే ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటారు.కానీ ఆయన రాజీనామా చేసిన వెంటనే ముగ్గురు దర్శకులతో..ముగ్గురు హీరోయిన్లతో కొత్త సినిమా తీయనున్నట్లు ప్రకటించారు. అంతే కాదు..ఎన్టీఆర్ జయంతి రోజున ఈ ప్రకటన చేయటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన యాభై ఏళ్ళ సినీ జీవితం లో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది.

గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందం గా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రభుత్వం మారినప్పుడు నామినెటెడ్ పోస్టుల నుంచి తప్పుకోవటం ఆనవాయితీ. రాఘవేంద్రరావు కూడా అదే పనిచేశారు. కాకపోతే తన రాజీనామాకు చెప్పిన కారణాలే వెరైటీగా ఉన్నాయి. అది తప్పు అని ఆయన మరుసటి రోజు చేసిన ప్రకటనే నిరూపించింది.

Next Story
Share it