Telugu Gateway
Cinema

ప్రభాస్ ‘రేస్ మొదలైంది’

ప్రభాస్ ‘రేస్ మొదలైంది’
X

సాహోతో ప్రభాస్ దూసుకెళ్ళటానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర యూనిట్ సడన్ గా ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను విడుదల చేసింది. నిజంగా ఈ ఫోటో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘ నిశ్సబ్దంగా ఉండండి..రేస్ మొదలైంది’ అని పేర్కొంది. బాహుబలి తర్వాత 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమానే ఇది.

సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శ్రద్ధా కపూర్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. యువీ క్రియేషన్స్ ఈ సినిమా నిర్మాణ సంస్థగా ఉంది.

Next Story
Share it