Telugu Gateway
Cinema

ఏటీఎంలోకి గొడుకేసుకెళ్లిన సమంత

ఏటీఎంలోకి గొడుకేసుకెళ్లిన సమంత
X

ఎవరైనా ఏటీఎంలోకి గొడుగు వేసుకుని పోతారా?. ఎవరూ అలాంటి పని చేయరు. కానీ ఓ బేబీ సినిమాలో మాత్రం సమంత అదే పనిచేసింది. గొడుగు వేసుకుని ఏటీఎంలో డబ్బులు తీసుకుని..వెనకున్న వ్యక్తికి ఈ గొడుగు పవర్ ఏంటో చూపించింది. ఓ బేటీ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఓ పాటను విడుదల చేసింది. ఇందులో సమంత చేసిన సందడి చూస్తుంటే సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయనే చెప్పొచ్చు. సమంత చాలా చలాకీగా..ఆకట్టుకునేలా పలు రకాల హావభావాలను ప్రదర్శిస్తుంది. ఈ మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌. టైటిల్‌ సాంగ్ లిరికల్‌ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. మిక్కీ జే మేయర్‌ సంగీతమందించిన ఈ పాటకు లక్ష్మీ భూపాల్‌ సాహిత్యం అందించారు. సీనియర్‌ నటి లక్ష్మీ మరో ప్రదాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య, రావూ రమేష్‌, రాజేంద్ర ప్రసాద్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్‌, క్సాస్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

https://www.youtube.com/watch?time_continue=218&v=tq8tp5_7CS4

Next Story
Share it